పాలకొండలో శాకాంబరిదేవిగా గారమ్మ తల్లి

పాలకొండ టెంపుల్స్, ఆగస్టు 06:

​పట్టణంలోని ప్రసిద్ధ గారమ్మ తల్లి ఆలయంలో గురువారం అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నకాపువీధి, పెద్దకాపువీధి, గెడ్డవీధి, లుంబూరువారి వీధి, గాసివీధి, గారమ్మకాలనీ, శయనవీధి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తదితర నైవేద్య సామగ్రిని సమర్పించారు. ఆలయ ధర్మకర్త పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సోపేటి సింహాచలం ఆధ్వర్యంలో అమ్మవారిని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

https://palakondatemples.blogspot.com/?m=1

No comments:

Post a Comment

పాలకొండ జగన్నాథుని నీడలో... ఏలాం జంక్షన్‌లో కొలువైన ‘సిద్ధి వినాయకుడు’!

​ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పాలకొండ పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పాలకొండలోని శ్రీ జగన్నాథ స్వామి ...