పురటాల పోలమాంబ అమ్మవారి 16వ వార్షికోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, 21-08-2026
పాలకొండ మెయిన్ రోడ్డులోని నాగవంశపువీధిలో వేంచేసియున్న పురటాల పోలమాంబ అమ్మవారి 16వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణ శుద్ధ త్రయోదశి, మంగళవారం (25-08-2026) రోజున నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి సన్నిధిలో మహిళలచే కలశ పూజలు జరిపించబడును. అదే రోజు సాయంత్రం అమ్మవారికి ముగ్గురాటలు అతివైభవంగా సమర్పించనున్నారు. పూజకు కావలసిన పసుపు, కుంకుమ, తమలపాకులు, ఫలరకాలు, కొబ్బరికాయలు, కలశం చెంబు, బియ్యం, పెసరపప్పు, గాజులు తదితర సామగ్రి వివరాలను నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు వేమకోటి రవిబాబు నేతృత్వంలో జరగనున్నాయి. ఈ వేడుకల్లో భక్తులందరూ పాల్గొనాలని పురటాల పోలమాంబ ఆలయ కమిటీ, బాల గణపతి భజన భక్తబృందం కోరాయి.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

No comments:

Post a Comment

పాలకొండ జగన్నాథుని నీడలో... ఏలాం జంక్షన్‌లో కొలువైన ‘సిద్ధి వినాయకుడు’!

​ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పాలకొండ పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పాలకొండలోని శ్రీ జగన్నాథ స్వామి ...